విచక్షణ కోల్పోయిన ఉపాధ్యాయుడి నిర్వాకంతో తొమ్మిదో తరగతి విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అజయ్ పై విచక్షణ కోల్పోయి… ఇనుప స్కేల్ తో చేయిపై కొట్టాడు. దీంతో చేయిపై గాయమై వాపు ఏర్పడింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతూ తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో… వారు గ్రామ పెద్దల సమక్షంలో హిందీ పండీట్ వీరన్నను అడిగేందుకు పాఠశాలకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వీరన్న డుమ్మా కొట్టాడు. విద్యార్ధిపై చేయి చేసుకున్నప్పటి నుంచి భయంతో వీరన్న బడికి రావడమే మానేశాడు. విద్యార్ధి అజయ్ ఇంటర్వెల్ లో టాయిలెట్ పోసి గ్రౌండ్ నుంచి తరగతి గది ఆలస్యంగా వెల్లడంతో విచక్షణ కోల్పోయి తన దగ్గర ఉన్న ఇనుప స్కేల్ తో కొట్టడంతో చేయికి గాయమై వాపు ఏర్పడింది. నొప్పి తాళలేక తల్లిదండ్రులకు విషయం చెప్పగా పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిని కలవడానికి రాగా…మూడు రోజుల నుంచి బడికి డుమ్మాకొడుతున్నాడు వీరన్న. ఈ విధంగా విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తుండటంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇతనిపై కంప్లెయింట్స్ ఉన్నాయంటున్నారు తోటి ఉపాధ్యాయులు. విద్యార్ధినుల పట్ల కూడా ఇతని ప్రవర్తన భిన్నంగా ఉండేదని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.