విశాఖ ఏజెన్సీ అరకువ్యాలీలో పోలీస్ కవాతు నిర్వహించారు. పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో ఈ పోలీసు కవాతు నిర్వహించారు. ఏజెన్సీలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో పోలింగ్ కోసం పౌరులకు భరోసా కల్పించడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పటిష్టం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ కవాతు నిర్వహించారు. ఈ కవాతులో స్థానిక పోలీసులు, ఏపీఎస్పీ పార్టీ, గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కు చెందిన దళాలు పాల్గొన్నాయి. పంచాయితీ ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేశామని అరకు సీఐ పైడయ్య చెప్పారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని నాయకులు ఎటువంటి ప్రలోభాలకు పాల్పడినా చర్యలు తప్పవని పైడయ్య హెచ్చరించారు.