రంగారెడ్డి జిల్లా కోర్టులో శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమాన్ని న్యాయవాదులు నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కమిటి సభ్యులు, సీనియర్ న్యాయవాదులతో పాటు వందలాది మంది న్యాయవాదులు పాల్గొని శ్రీరామ మందిరం కోసం నిధి సమర్పించారు.
ఈ సందర్భంగా VHP అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ మాట్లాడుతూ అయోధ్య రామమందిర నిర్మాణం కోసం న్యాయవాదులు సాగించిన పోరాటం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినదని, శ్రీరామ మందిర నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు కోర్టు ఆవరణలో కార్యక్రమాన్ని నిర్వహించి అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం ఒక ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
ఈకార్యక్రమంలో జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు M. శ్రీనివాస్ , మాజీ అధ్యక్షులుP. శ్రీనాథ్ , G . చంద్రశేఖర్ రెడ్డి , న్యాయవాద పరిషత్ అధ్యక్షులు హరీష్ రెడ్డి తదితరులతో పాటు వందలాది మంది న్యాయవాదులు పాల్గొని నిధి సమర్పణ చేశారు. ఈసందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో జైశ్రీరాం నినాదాలతో న్యాయవాదులు హోరెత్తించారు.