ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో పై చేయి కోసం అధికార పార్టీ నేతలు సర్వ శక్తులు వొడ్డు తున్నారు. ఇటు కార్యకర్తల్లో, అటు ప్రజల్లో ఏమాత్రం అసంతృప్తి వున్నా పటాపంచలు చేయాలని చూస్తున్నారు.. తమని కాదన్న వారిని వీలైనంత వరకు నయానో, భయానో తమ దారికి తెచ్చుకునే పనిలో పడ్డారు. ఈ క్రమం లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం, నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు నిర్వహించడం వైసీపీ నేతలకు కామన్ అయిపోయింది.. కొన్ని చోట్ల ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గ్రామాల అభివృద్ధికి అధికార పార్టీ నేతలు హామీలు గుప్పించి మరి, పంచాయితీ పోరులో పైచేయి సాధించేందుకు చూస్తున్నారు. మునుపెన్నడూ లేని చందంగా అసె0బ్లీ ఎన్నికలను తలదన్నే రీతిలో జరుగుతున్న పల్లె పోరు పై స్పెషల్ స్టోర
పంచాయితీ ఎన్నికల నేపధ్యం లో ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గ్రామాభివృద్ధి కోసం జరిగే ఎన్నికలు చివరకు ప్రేస్టేజీ గా మారి అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్ళను దారితీస్తోంది. కొన్ని జిల్లాల్లో ఏకంగా నేతల అరెస్టులు , ఫోన్ కాల్ బెదిరింపులు, చివరకు భౌతిక దాడులకు పాల్పడిన ఘటనలు చూస్తుంటే ఈ పంచాయితీ పోరు ఏ దారి తీస్తుందో నన్న భయం జనం గుండెల్లో గుబులు రేకిస్తోంది..
స్థానిక సంస్థల ఎన్నికల మొదలు సాధారణ ఎన్నికల వరకు ఉత్తరాంధ్ర దే అగ్రస్థానం అన్న సంగతి తెలిసిందే.. తూర్పున ఏపార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందో ఆ పార్టీ దే హవా… అన్న ప్రచారం లేక పోలేదు.. దాదాపు 4 దశాబ్దాలుగా ఇదే రాజకీయాల్లో కొనసాగుతూ ఉంది, పార్టీ నేతల్లోనూ బలంగా నాటుకు పోయింది.. దీంతో ఉత్తరాంధ్ర జిల్లా లైన
శ్రీ కాకుళం, విజయనగరం, విశాఖపట్నం లలో పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీ తన సత్తా చాటు కునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది… ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం వైసీపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు తన వంతు కృషి చేస్తోంది. మరో వైపు ఎన్నికల కమిషన్ విధి విధానాలు, ప్రభుత్వ ఆలోచనలకు ఎక్కడికక్కడ కళ్లెం వేస్తూ ఆ శాఖ కమిషనర్ దూకుడు పంచాయితీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కొండంత అండనే ప్రచారం ఇప్పటికే రాష్ట్ర0 లో గుప్పుమంది.
ఎన్ని అడ్డంకులున్న, ఎవరేమన్న… పల్లె పోరులో పైచేయి కోసం అధికార పార్టీ సర్వ శక్తులు వొడ్డు తోంది.. పంచాయితీ పోరులో ఏకగ్రీవాల తో బాటు, తమ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దఎత్తున నిధులిచ్చేలా చూస్తామని పాలక పార్టీ పెద్దలు హామీలు గుప్పిస్తున్నారు.గ్రామ పెద్దలతో మంత నాలు సాగిస్తున్నారు..
విజువల్స్:..
ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలన్న పట్టు దాలతో కొంత మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు లేక పోలేదు..తాజాగా విశాఖ జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే యూవి.రమణ మూర్తి రాజు రాంబిల్లి మండలం 10 వార్డు అభ్యర్ధిగా ప్రతిపక్ష పార్టీ నుంచి పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం తో అతని అల్లుడిని చరవాణిలో హెచ్చరించడం, ఈ విషయం పై తెలుగు దేశం నేతలు కన్నబాబురాజు తమ అభ్యర్థి బంధువును బెదిరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే..
మరో వైపు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు ఎన్నికల నిబంధనలను పక్కన పెట్టి రాంపురం గ్రామం , రైతు భరోసా కేంద్రం లో రాత్రికి రాత్రే స్థానిక గ్రామస్థులతో సమావేశం నిర్వహించి , పలువురికి పార్టీ కండువా కప్పడం, తన భార్య పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున గెలిపించాలంటూ అభ్యర్ధించడం చూస్తుంటే, అధికార పార్టీ ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదనేది స్పష్ట మౌతోంది..పంచాయితీ తొలి పోరు లొనే ఇలాంటి పరిస్తులు0టే… రాబోయే రెండు, మూడు, నాలుగు దశల ఎన్నికల్లో గెలుపు కోసం ఇంకెన్ని పరిణామాలు చూడాల్సి వస్తుందో అని గ్రామాల్లో పెద్దలు, పిన్నలు పంచాయితీ గట్ల పైనే చర్చించుకుంటున్నారు..