తొలిసారిగా చేపట్టిన ఓటీపీ విధానంలో రేషన్ సరకుల పంపిణీ వ్యవస్థ ఆదిలాబాద్ జిల్లాలోని కార్డుదారులకు చుక్కలు చూపెడుతోంది. కొత్త విధానంలో సరకులు పొందాలంటే ఆధార్‌కార్డుకు మొబైల్ నంబర్ అనుసంధానం తప్పనిసరి కావడంతో సంబంధీకులంతా ఆధార్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.
వీరంతా ఓటేసేందుకు కాదు..ఓటిపి కోసం ఉదయం 5 గంటలనుండే ఆదిలాబాద్ పట్టణం ఫిల్టర్‌బెడ్ ఆధార్ నమోదు కేంద్రానికి వచ్చి బారులు తీరారు. పలు కాలనీలకు చెందిన వృద్ధులు, మహిళలు సుమారు 4 గంటల పాటు ఇలా వరుసకట్టి టోకెన్ తీసుకున్నారు. మూడు రోజులుగా వరస కడితే ఈ నెల 9న రావాలంటూ టోకెన్ రాసి ఇచ్చారు. మొబైల్ నంబర్, ఆధార్ అనుసంధానం రోజుకు 30 మంది కంటే ఎక్కువ నమోదు కావడంలేదని, వచ్చిన వారికి ఇలా టోకెన్లు ఇచ్చి తిరిగి రమ్మని చెబుతున్నట్లు కేంద్ర నిర్వాహకులు చెబుతున్నారు.
టోకెన్ల కోసమే కొందరు మూడు రోజులుగా ఉదయం 5 గంటలకు ఆధార్ నమోదు కేంద్రాలకు తరలివచ్చి అగచాట్లు పడుతున్నారు.రోజు కూలీకి పోయేవాళ్ళం రెండు రోజులుగా ఆధార్ కేంద్రలవడ్డ పడిగాపులు కయాల్సి వస్తుందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఆధార్‌కార్డుకు మొబైల్ నంబర్ అనుసంధానం చేసే ప్రక్రియను సంబందిత రేషన్ దుకాణాల్లోనే ఏర్పాటు చేయాలనీ పలువురు లబ్దీదారులు కోరుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో సగం మందికి ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ అనుసంధానం కాలేదు. మిగిలిన వారికి సరకులు అందాలంటే ఐరిస్ విధానంలో తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఐరిస్ పరికరం ద్వారా కార్డుదారు కనుపాపను స్కాన్ చేయాల్సి ఉంటుంది. వెలుతురు సమయంలో ఆ పరికరం పని చేయక రేషన్ ఇవ్వడంలో ఇబ్బందులు తలెత్తున్నాయి. వృద్ధులు, కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికీ ఐరిస్ పనిచేయటం లేదని ,ఒక్కొక్కరికి అరగంటపైనే పడుతోందని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
- Uncategorized
- అంతర్జాతీయం
- ఆంధ్రప్రదేశ్
- క్రీడలు
- క్రైమ్
- జాతీయం
- జీవనశైలి
- తెలంగాణ
- రాజకీయాలు
- వ్యాపారం
- సినిమా