మహబూబాబాద్ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఆటో ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన గుడూరు మండలం మర్రిమిట్టలో చోటుచేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు సమాచారం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.