పెద్దపల్లి జిల్లా సింగరేణి ఏరియాలో బాహుబలి ప్రభాస్ సందడి చేస్తున్నారు. రామగిరి మండలం ఓసీపీ-2 బొగ్గు గనిలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాలార్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక్కడి బొగ్గు గనుల్లో ప్రభాస్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. దీంతో స్టార్ హీరోను చూడటానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే మీడియా తో సహా ఎవరినీ పోలీసులు అనుమతించలేదు.