• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Bharath Today TV
Advertisement
  • Home
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • క్రీడలు
  • క్రైమ్
  • సినిమా
  • జీవనశైలి
  • వ్యాపారం
No Result
View All Result
  • Home
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • క్రీడలు
  • క్రైమ్
  • సినిమా
  • జీవనశైలి
  • వ్యాపారం
No Result
View All Result
BharathtodayTV
No Result
View All Result
Home అంతర్జాతీయం

భారత్ మీద మావో ఎజెండా

Bharathtoday by Bharathtoday
January 26, 2021
in అంతర్జాతీయం, జాతీయం, రాజకీయాలు
0
భారత్ మీద మావో ఎజెండా
0
SHARES
62
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగాన్ని చైనా ఆక్రమించడం, అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేయడం సంచలనం రేపుతోంది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం ఇవాళ కొత్త కాదు. కానీ భారత్ చైనాను విజయవంతంగా నిలువరిస్తోంది. ఈ విషయం పక్కన పెడితే చైనా అరుణాచల్ మీద ఎందుకు కన్నేసిందనేదే ముఖ్యాంశం.

ఎలా బయటపడింది?
అమెరికాలోని ప్లానెట్ ల్యాబ్స్ తీసిన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ విషయం వెలుగుచూసింది. ఆ ఇమేజెస్ గత నవంబర్ లోవి. తాజా ఫొటోల్లో కొత్త ఇళ్ల సముదాయం కనిపించింది. అదే చోట 2019 ఆగస్టులో ఇళ్లేవీ లేవు. ఇళ్లు నిర్మించిన ప్రాంతం భారత్-చైనా సరిహద్దు నుంచి అరుణాచల్ భూభాగంలో దాదాపు 5 కి.మీ. లోపలికి వచ్చేసింది. అంటే ఏడాదిలో చైనా అక్కడ శాశ్వత మానవ నివాసాలను నిర్మించిందన్నమాట. సారీ చూ అనే నది ఒడ్డున చైనా పౌరులకు శాశ్వత నివాసాలు నిర్మిస్తోంది. చైనా పౌరులు కూడా ఇప్పుడక్కడ తరచుగా కనిపిస్తున్నారు. దీనిపై స్థానిక బీజేపీ ఎంపీ కూడా కేంద్రాన్ని అలర్ట్ చేశాడు.

చైనా ఎందుకిలా చేస్తోంది?
చైనా భారత భూభాగం మీద కన్నేయడమనేది కొత్త కాదు. ఆక్రమించడానికి చైనా ఎప్పట్నుంచో కాచుకొని ఉంది. నెహ్రూ హయాంలోనే చైనా భారత భూభాగాన్ని ఆక్రమించడం మొదలుపెట్టింది. ఒక్క భారతే కాదు చైనాతో జపాన్, ఫిలిప్పీన్స్, మలేషియా, తైవాన్ వంటి అనేక దేశాలకు సరిహద్దు వివాదాలున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో మిలిటరీ విన్యాసాలు చేస్తూ, అక్కడి దీవుల చుట్టూ భారీగా సైన్యాన్ని మోహరించి ఆయా పాలకుల్ని, ప్రజల్ని భయకంపితుల్ని చేస్తోంది. పరిస్థితిని యుద్ధం దాకా తీసుకెళ్లకుండా కేవలం భయపెట్టడం ద్వారా ఆధిపత్యం సాధించాలనేది చైనా వ్యూహంగా తెలుస్తోంది. ఈ క్రమంలో సహజ వనరులు, మానవ వనరులతో ఉన్న భారత్ మీద కన్ను పడకపోతే ఆశ్చర్యం కానీ.. పడటంలో ఆశ్చర్యం ఏముంది?

భారత ఉపఖండంతో చైనాను కలుపుతున్న భూభాగం టిబెట్. టిబెట్ ను కబ్జా చేస్తే భారత చివరి భూభాలు సులభంగా వశమవుతాయనేది చైనా కుట్ర. ఈ కుట్రకు రూపకర్త ఆధునిక చైనా ప్రగతి పాలకుడుగా అందిరికీ తెలిసిన మావో జెడాంగ్. ఆయన చెప్పిందే ఫైవ్ ఫింగర్ థియరీ. ఈ థియరీ ప్రకారం టిబెట్ అనే పంజా లాంటి భూభాగాన్ని ముందుగా కబ్జా చేసుకుంటే దానికి కొనసాగింపుగా ఉన్న లద్దాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ అనే భారత ఉపఖండంలోని ఐదు వేళ్ల లాంటి ప్రాంతాలపై అతిసులతభంగా అదుపు సాధించవచ్చు. ఇది మావో ప్రతిపాదించి, కమ్యూనిస్టు క్లాసుల్లో ప్రవచించిన థియరీగా చైనాలో చాలా పాపులరైంది. అదే సూత్రాన్ని ఇప్పటి చైనా పాలకులు కూడా తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. ఈ థియరీలో భాగంగా ఇప్పటికే టిబెట్ ను స్వాధీనపరుచుకుంది చైనా. దలైలామాకు మనం ఆశ్రయం కల్పించామన్న వంకతో 1962లో యుద్ధానికి దిగింది. ఆ తరువాత మైళ్లకొద్దీ భూభాగాన్ని కబ్జా చేసింది. ఈ క్రమంలోనే మొన్న లద్దాఖ్ లో దాడి, భారత్ తో సరిహద్దు విషయంలో నేపాల్ తో జోక్యం చేసుకోవడం, నేపాల్ ప్రజల్లో భారత్ పట్ల అనుమానాలు కలిగించేందుకు ప్రయత్నించడం, తాజాగా అరుణాచల్ లో ప్రవేశించడం.. ఇలాంటివన్నీ మావో జెడాంగ్ థియరీ అమలులో భాగమేనని గమనించాలి.

ఆక్రమించిన అరుణాచల్ భూభాగం మీద చైనాకు హక్కుందా?
చైనా అరుణాచల్ ను ఆక్రమించడానికి, అది తన భూభాగంలోనే ఉందనడానికి చైనా పాతకాలం నాటి పనికిరాని ఓ కారణాన్ని సాకుగా తీసుకుంది. అదేంటంటే.. 1904లో ఇండియన్ బ్రిటిష్ సైన్యం టిబెట్ మీద దాడి చేసింది. అప్పుడు టిబెట్ దలైలామా పాలనలోనే ఉండేది. అయితే బ్రిటిషర్స్ దాడితో దలైలామా మంగోలియా వెళ్లి తల దాచుకున్నాడు. ఆ తరువాత 9 ఏళ్లకు దలైలామా మళ్లీ టిబెట్ వచ్చి పరిపాలన చూసుకోవడం ప్రారంభించాడు. ఆయన పాలన 1913-1950 దాకా సాగింది. 1950లోనే టిబెట్ ను చైనా ఆక్రమించింది. చైనా ఆక్రమణ నుంచి టిబెట్ లోని తవాంగ్ ను తప్పించడానికి దలైలామా అధికారికంగా భారత్ లో కలిపేశాడు. ఇదే తవాంగ్ ఒప్పందం. తవాంగ్ నే ఎందుకు కలిపాడంటే తవాంగ్ అనేది టిబెట్ లోని బౌద్ధ సన్యాసులకు ఒక గుండెకాయ లాంటి ప్రాంతం. బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే అనేక ఆరామాలు, భారీ కట్టడాలు, శిక్షణా తరగతులు నిర్వహించుకునే ఏర్పాట్లు తవాంగ్ లోనే ఉన్నాయి. ఇలా తవాంగ్ అనేది టిబెట్ కు సాంస్కృతికంగా కేంద్ర ప్రాంతంలాంటిది. ఇది భారత్ లో అరుణాచల్ ను ఆనుకుని ఉన్న చిన్నపాటి భూభాగం. ఆ ప్రాంతాన్ని భారత్ లో కలపడం ద్వారా చైనా నుంచి తప్పించవచ్చని దలైలామా ముందుచూపుతో ఆ పని చేశాడు. అయితే టిబెట్ భూభాగమంతా నాదే అంటున్న చైనా.. కావాలనే ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అరుణాచల్ లో స్థిరనివాసాలు ఏర్పాటు చేయడం వెనుక ఆ భూభాగం టిబెట్ ది కాబట్టే అనే చెప్తూ తొండాట ఆడుతోంది. వాస్తవానికి టిబెట్ గతంలో ఎప్పుడూ చైనా ఆధీనంలో లేదు. 17వ శతాబ్దం నుంచి అందుబాటులో ఉన్న టిబెట్ చరిత్రను, సాహిత్యాన్ని పరిశీలించినా ఇదే ధ్రువీకరిస్తోంది. ఇంకా చెప్పాలంటే చైనాలోని గాంసు, యునాన్ అనే ప్రావిన్స్ కూడా టిబెట్ లో భాగంగానే ఉండేవి. 1950 వరకు కూడా టిబెట్ స్వతంత్ర దేశమే. స్వతంత్ర దేశంగా భారత్ లో కలిపిన భూభాగాన్ని చైనా తన ఖాతాలో వేసుకోవడమే కాదు.. తన మ్యాపుల్లో కూడా కనిపించకుండా చేసింది. ఈ ఒక్కటే కాదు చైనా మ్యాపుల్లో భారత సరిహద్దు ప్రాంతాలు అనేకం కనిపించకుండా పోయాయి.

ఇప్పుడేం జరుగుతుంది?
భారత్ ఇప్పుడేం చేయాలి.. ఏం చేస్తుందనేది కీలకమైన అంశం. భారత్ ముందున్నవి మూడు మార్గాలు. 1) చైనాతో యుద్ధం చేసి గెలుపొందడం. 2) ఆర్థికంగా దెబ్బతీయడం. 3) అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టి చైనాను ఏకాకిని చేయడం. ఈ మూడింట్లో మొదటిది ఆచరణ సాధ్యమైంది కాదు. మిగతా రెండు మార్గాలనూ భారత్ ఎంచుకుంది. చైనాతో సంబంధాలు పెద్దగా ప్రభావితం చేసుకోకుండా దాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఉన్న మార్గాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. కుయుక్తులతో దేశంలోకి ఎంటరవుతున్న వ్యక్తులను, సంస్థలను ఏరిపారేస్తోంది. చైనా టెక్నాలజీ విశృంఖలత్వాన్ని అదుపు చేస్తోంది. అంతర్జాతీయంగా చైనా మీద ఒత్తిడి తేవడంలోనూ సఫలమైంది. ముఖ్యంగా అమెరికా నుంచి భారీ ఎత్తున మద్దతు కూడగట్టింది. మొన్న డిసెంబర్ లో అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టమే అందుకు నిదర్శనం. టిబెట్ కు సంబంధించి దలైలామా ఎన్నిక విషయంలో చైనా జోక్యాన్ని తాము సహించబోమని.. టిబెట్ ప్రజలు, బౌద్ధ సన్యాసులు, టిబెట్ పౌరులు స్వేచ్ఛగా దలైలామాను ఎన్నుకోవాలని అమెరికా చట్టరీత్యా హెచ్చరించింది. ఇది టిబెట్ కు వాషింగ్టన్ ఇస్తున్న రాజముద్రిక లాంటి మద్దతు. దీనిపై చైనా తీవ్రమైన అసహనం వ్యక్తం చేసింది. ఇది “మా అంతర్గత” వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఖండించింది. అమెరికా ఇంత స్పష్టమైన వైఖరి తీసుకోవడం వెనకాల భారత్ చేసిన కృషి అద్భుతమైంది. అంతేకాదు… మోడీ మొదటిసారి ఎన్నికైన తరువాత వరుస విదేశీ టూర్లు పెట్టుకున్న ఎజెండా కూడా ఇదే. చైనాతో సరిహద్దు సమస్యలు ఎదుర్కొంటున్న జపాన్, ఫిలిప్పీన్, మలేషియా వంటి అనేక దేశాలతో మోడీ చర్చలు ఒక అవగాహనకు వచ్చేలా జరిగాయి. కాబట్టి చైనా మీద భౌతిక దాడి కన్నా వ్యూహాత్మకంగా ముప్పేట దాడి చేయడాన్నే భారత్ ఎంచుకుంది. ఇదే ఇప్పుడు దానికి మింగుడుపడని అంశం. కానీ తన మొండివైఖరి వల్ల చైనా మూర్ఖంగా వ్యవహరించి కయ్యానికే కాలు దువ్వుతుందా.. లేక ఒక్కొక్కటిగా తన చుట్టూ ఉన్న అందరినీ శత్రు దేశాలుగా మార్చుకుంటుందా అనేది రాబోయే రోజులే నిర్ణయిస్తాయి.

T. Ramessh

Executive Editor


Spread the love
Previous Post

కామారెడ్డిలో ఆలయాల్లో దొంగలు

Next Post

తిరుపతిలో మాక్కూడా సీట్లివ్వండి

Bharathtoday

Bharathtoday

Next Post
తిరుపతిలో మాక్కూడా సీట్లివ్వండి

తిరుపతిలో మాక్కూడా సీట్లివ్వండి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected test

  • 85 Followers
  • 23k Followers
  • 99 Subscribers
  • Trending
  • Comments
  • Latest
జెండా పండుగ నిర్వహించని హెడ్మాస్టరు

జెండా పండుగ నిర్వహించని హెడ్మాస్టరు

January 26, 2021
భారత్ టుడే స్టూడియోలో క్యాలెండర్ ఆవిష్కరణ

భారత్ టుడే స్టూడియోలో క్యాలెండర్ ఆవిష్కరణ

January 20, 2021
భారత్ మీద మావో ఎజెండా

భారత్ మీద మావో ఎజెండా

January 26, 2021
బతుకుదెరువునిచ్చిన ఆటోను బుగ్గిపాలు చేశాడు.. ఎందుకంటే..

బతుకుదెరువునిచ్చిన ఆటోను బుగ్గిపాలు చేశాడు.. ఎందుకంటే..

January 22, 2021
బెంగాల్లో బిజెపి తీన్మార్

బెంగాల్లో బిజెపి తీన్మార్

0

With 150 million daily active users, Instagram Stories is launching ads

0

Washington prepares for Donald Trump’s big moment

0

CS:GO ELeague Major pools and tournament schedule announced

0
బెంగాల్లో బిజెపి తీన్మార్

బెంగాల్లో బిజెపి తీన్మార్

March 3, 2021
కేరళలో కమలం కోలాహలం

కేరళలో కమలం కోలాహలం

March 3, 2021
బుసలుకొట్టిన హిందూ విద్వేషం

బుసలుకొట్టిన హిందూ విద్వేషం

February 23, 2021
ఏజెన్సీలో  ఆ వ్యాపారం మూడు బకెట్లు – ఆరు లారీలు…?

ఏజెన్సీలో ఆ వ్యాపారం మూడు బకెట్లు – ఆరు లారీలు…?

February 16, 2021

Recent News

బెంగాల్లో బిజెపి తీన్మార్

బెంగాల్లో బిజెపి తీన్మార్

March 3, 2021
కేరళలో కమలం కోలాహలం

కేరళలో కమలం కోలాహలం

March 3, 2021
బుసలుకొట్టిన హిందూ విద్వేషం

బుసలుకొట్టిన హిందూ విద్వేషం

February 23, 2021
ఏజెన్సీలో  ఆ వ్యాపారం మూడు బకెట్లు – ఆరు లారీలు…?

ఏజెన్సీలో ఆ వ్యాపారం మూడు బకెట్లు – ఆరు లారీలు…?

February 16, 2021

Bharath Today TV

We bring you the best News that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • క్రీడలు
  • క్రైమ్
  • జాతీయం
  • జీవనశైలి
  • తెలంగాణ
  • రాజకీయాలు
  • వ్యాపారం
  • సినిమా

Recent News

బెంగాల్లో బిజెపి తీన్మార్

బెంగాల్లో బిజెపి తీన్మార్

March 3, 2021
కేరళలో కమలం కోలాహలం

కేరళలో కమలం కోలాహలం

March 3, 2021
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2021 Bharath Today TV - Powered ByVilambi Solutions Pvt Ltd.

No Result
View All Result
  • Home
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • సినిమా
  • జీవనశైలి
  • క్రైమ్
  • క్రీడలు
  • వ్యాపారం

© 2021 Bharath Today TV - Powered ByVilambi Solutions Pvt Ltd.