దొంగలు ఏటీఎంను పగులగొట్టారు. కానీ వారనుకున్నది సాధించలేకపోయారు. కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కోయిలకుంట్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్ధానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణంలో ఏర్పాటు చేసిన ఏటీఎంలో గుర్తు తెలియని దుండగులు శుక్రవారం తెల్లవారుజామున చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇద్దరు వ్యక్తులు ముఖాలకు మాస్కులు కప్పుకొని గొడ్డళ్లు, సుత్తి, కట్టర్లతో పగులగొట్టి అందులోని అమౌంట్ ఎత్తుకెళ్లాడానికి ప్రయత్నించారు. అయితే అంతలోనే అటువైపుగా వస్తున్న పెట్రోలింగ్ వెహికల్ సైరన్ వినగానే దుండగులు పరారు అయ్యారని, ఏటీఎం మిషన్ లోని అమౌంట్ ఏమీ పోలేదని, మిషన్ మాత్రం పాక్షికంగా దెబ్బతిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సుబ్బారాయుడు, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.