దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ సికింద్రాబాద్ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎస్‌సీఆర్‌ఈఎస్ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్‌గౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘అతి త్వరలో కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు.. శాసనసభ, రైల్వే కార్మికుల తరఫున శుభాకాంక్షలు చెబుతున్నా… కేటీఆర్ సీఎం అయ్యాక రైల్వే ఉద్యోగులను కాపాడాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ పద్మారావు అన్నారు అందరినీ ఆశ్చర్యపరిచారు. మంత్రి కేటీఆర్ సభలో ఉండగానే పద్మారావు శుభాకాంక్షలు తెలపడం విశేషం.
గత కొద్దిరోజులుగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ పలువురు మంత్రులు కామెంట్లు చేస్తున్నారు. ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, గుత్తా సుఖేందర్ రెడ్డి.. ఇలా పలువురు ముఖ్య నేతలే వ్యాఖ్యానించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 18న కేటీఆర్ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపడతారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి.