కార్పొరేట్ బ్యూటీ సెలూన్లతో తమ పొట్టలు కొట్టవద్దని మంచిర్యాల జిల్లా నాయీ బ్రాహ్మలు నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నెలకొల్పిన కార్పొరేట్ బ్యూటీ సెలూన్ ను వేంటనే ఎత్తివేయాలని మందమర్రి పట్టణంలో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ తీసి MRO కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకుడు తిరుపతి నాయీ మాట్లాడుతూ తరతరాలుగా కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్న తమకు ఈ కార్పొరేట్ బ్యూటీ సెలూన్ల వల్ల ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు . పాలకులు, నాయకులు స్పందించి తమ ఉపాధి దెబ్బతీసే కార్పొరేట్ బ్యూటీ సెలూన్లు మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.