ఏపీలో జగన్ సర్కారు ఎంతో శ్రమకోర్చి ప్రభుత్వ బడులను ప్రైవేటుకు దీటుగా తయారు చేస్తుంటే కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రం జగన్ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. బడిపిల్లలతో ఉపాధ్యాయులే కూలీ పనులు చేయిస్తున్న వైనం సాక్ష్యత్తు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంచార్జ్ గా ఉన్న కడప జిల్లాలో బయటపడింది. ముద్దనూరు ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేటుకు దీటుగా తయారుచేస్తుంటే మరో పక్క కొంత మంది ఉపాద్యాయులు మాత్రం సీఎం జగన్ ఆశయానికి అనుగుణంగా పనిచేయడం లేదన్న ఆరోపణలు.. ఈ ఘటనతో నిజమని నిరూపిస్తోంది. స్కూళ్లలో అవసరాన్ని బట్టి చిన్నచిన్న పనులు చేయిస్తే ఫరవా లేదు కానీ.. కంకర ఎత్తడం, మట్టి ఎత్తడం వంటి పెద్దపనులు చేయించడం విమర్శలకు దారితీస్తోంది. సీఎం సొంత జిల్లాలో జరిగిన ఘటన పై అధికారులు, ప్రజా ప్రతినిధులు సంబంధిత ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకుంటారో లేక మిన్నకుండిపోతారో వేచి చూడాలి. జిల్లాలో ఏకంగా ఒక డిప్యూటీ సీఎం, ప్రభుత్వ చీఫ్ విప్, ప్రభుత్వ విప్ ఏకంగా విద్యా శాఖ మంత్రులు ఉన్నా ముద్దనూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఇలా చేయడం పట్ల వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది.