కోరిన కోరికలు తీర్చే భగవంతుడి చెంత కవర్లు కరవయ్యాయి. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనానికి ఎంతో దూరం నుంచి, ఎన్నో వ్యయ ప్రయాసలతో భక్తులు వేలాదిగా వస్తూంటారు. భక్తుల సంఖ్య ఒక గంటలో వేలాది మందిగా ఉంటుందంటే.. ఇక్కడ రద్దీ ఎంతలా ఉంటుందో ఊహించవచ్చు. దీనిద్వారా ఆలయానికీ పెద్దఎత్తున ఆదాయం వస్తూంటుంది. అయితే గత పది రోజులుగా ఆలయంలో ప్రసాదాల కవర్లకు కొరత ఏర్పడింది. దీంతో ప్రసాదాలు తీసుకున్న భక్తులకు వాటిని తీసుకెళ్లడం చాలా ఇబ్బందిగా మారింది. దాదాపు పది రోజులవుతున్నా సంబంధిత గుత్తేదారు మాత్రం కవర్లను సమకూర్చలేదు. దీంతో భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు.